సాహిత్య విమర్శ బులిటెన్-1, 24.8.2020
Dear Students of (TL 502, Principles of Literary Criticism), PLC ... మనం ఇంటర్నల్స్ లో భాగంగా ఒక పరీక్ష, ఒక పుస్తకం మీద సమీక్ష, ఒక సెమినార్ నిర్వహించుకుంటాం. ఇవి ఒక్కొక్కటి 20 మార్కులు చొప్పున ఉంటాయి. వీటిలో బాగా మార్కులు వచ్చిన రెండింటిని ఫైనల్ మార్కులకు కలపడం జరుగుతుంది. ఫైనల్ పరీక్ష 60 మార్కులకు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే మీకు నచ్చిన ఏదొక సృజనాత్మక రచనను ఎంపిక చేసుకోవాలి. దాన్ని మీరు సమీక్షించి, నాకు ఆ వ్యాసాన్ని సమర్పించాలి. మీరు ఎంపిక చేసుకున్న పుస్తకం వివరాలు నాకు ముందుగా తెలియజేయాలి. నేను కొన్ని తరగతులు అయిన తరువాత ఎనౌన్స్ చేస్తాను. ఆ తేదీలోగా మీ సమీక్షా వ్యాసాన్ని నా ఈ మెయిల్ కి పంపించాలి.
మీరు మంచి పుస్తకం ఎంపిక చేసుకోవడానికి ఒక పుస్తకాలు అందించే వాట్సాప్ గ్రూపు ( సాధ్యమైనంత వరకు మీకు కావలసినవాటిని ) ఉచితంగా అందిస్తారు. మీకు కావలసిన పుస్తకాలు లభించే ఆ వాట్సాప్ గ్రూపు వివరాలు తర్వాత తెలియజేస్తాను.
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 24.8.2020
No comments:
Post a Comment