తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం,హైదరాబాదు లో నా వివరాలు. నా బోధనావివరాలు,నేను బోధించే సిలబస్ , నా విద్యార్థుల వివరాలు తదితర విషయాలు ప్రతిబింబించే వేదిక.
Friday, April 23, 2010
EVOLUTION OF TELUGU LITERATURE -III madel paper
UNIVERSITY OF HYDERABAD
Centre for Integrated Studies
End of Semester Examinations, April, 2010
Integrated M.A. Telugu, IV Semester
Course: EVOLUTION OF TELUGU LITERATURE -III
Date: 19-04-2010 Time : 2.00 P.M to 5.00 P.M
కింది వాటిలో ఆరు ప్రశ్నలకు సమాధానాలను రాయండి. 6X10 = 60 మార్కులు
1. తెలుగులో ప్రబంధయుగకాలాన్ని తెలిపి, ప్రబంధ లక్షణాలను వివరించండి.
2. కింది వానిలో మీకు నచ్చిన ఒక తెలుగు ప్రబంధాన్ని పరిచయం చేయండి.
అ) పారిజాతాపహరణం ఆ) కళాపూర్ణోదయం ఇ) వసుచరిత్ర ఈ) ఆముక్తమాల్యద
3. దక్షిణాంధ్ర యుగంలో ప్రసిద్ధులైన కవయిత్రుల విశేషాలను పేర్కొనండి.
4. సాహిత్య చరిత్రలో పదహారవ శతాబ్ద్యానంతర యుగ ప్రత్యేకతలను విశ్లేషించండి.
5. కింది ప్రాచీన సాహిత్య ప్రక్రియలలో రెండింటి గురించి వివరించండి.
అ) యక్షగానం ఆ) శతకం ఇ) చాటువులు ఈ) ఉదాహరణం
6. ఆధునికత అంటే ఏమిటి? తెలుగు సాహిత్యంలో ఆధునిక లక్షణాలను పేర్కొనండి.
7. ఆధునిక సాహిత్యంలో కనిపించే కింది ధోరణుల్లో రెండింటి గురించి రాయండి.
అ) భావకవిత్వం ఆ) అభ్యుదయ కవిత్వం ఇ) దిగంబర కవిత్వం ఈ) విప్లవ కవిత్వం
8. కింది ఆధునిక సాహిత్య ప్రక్రియలలో రెండింటి గురించి వివరించండి.
అ) వచన కవిత్వం ఆ) నవల ఇ) కథానిక ఈ ) జీవిత చరిత్ర
9. కవుల చరిత్ర, సాహిత్య చరిత్రలకు మధ్య గల భేదాలను తెలపండి.
10. పదహారవ శతాబ్దం నుండి ఆధునిక యుగం వరకూ గల సాహిత్య పరిణామాన్ని వివరించండి.
Wednesday, April 29, 2009
M.A.Telugu, IV SEMESTER,Principles of Literary Criticism ,
DEPARTMENT OF TELUGU
END- SEMESTER EXAMINATIONS APRIL 2009
M.A.Telugu, IV SEMESTER
Course: HT – HT 579 Principles of Literary Criticism
Time: 3 Hrs Max.Marks: 60
కింది ప్రశ్నలలో నాలుగింటికి వ్యాస రూప సమాధానాలను రాయండి. ( 4x15 = 60 మార్కులు)
1. సాహిత్య విమర్శను నిర్వచించి దాని లక్షణాలను పేర్కొనండి.
2. సాహిత్య విమర్శకు ఉండ వలసిన మౌలిక లక్షణాలను సోదాహరణంగా సమన్వయించండి.
3. ప్రాచీన తెలుగు సాహిత్యం లో కనిపించే విమర్శనాంశాలను సమీక్షించండి.
4. సాహిత్య విమర్శ పద్ధతులను వివరించండి.
5. తులనాత్మక - వాద ప్రతివాద విమర్శల భేద సాదృశ్యాలను చర్చించండి.
6. తెలుగు సాహిత్య విమర్శలో కట్టమంచి రామలింగారెడ్డి స్థానాన్ని తెలపండి.
7. “విమర్శకుడుగా శ్రీశ్రీ ““వస్తు శిల్ప సమన్వయ విమర్శకుడు” వల్లంపాటి వెంకట సుబ్బయ్య
Tuesday, April 21, 2009
Principles of Literary Criticism model paper
University of Hyderabad
Department of Telugu
End-Semester Examinations, April 2008
M.A.IV Semester
Course HT 579 Principles of Literary Criticism
Date: 01-05-2008
Time: 3.00 Hrs Max.Marks: 60
ఈ కింది ప్రశ్నలలో రెండింటికి వ్యాస రూప సమాధానాలను రాయండి.
1. సాహిత్య విమర్శను నిర్వచించి, దాని ప్రయోజనాలను పేర్కొనండి.
2.సాహిత్య విమర్శ మౌలిక లక్షణాలను పేర్కొని, విమర్శకుడికి ఉండవలసిన అర్హతలను వివరించండి.
3. తెలుగు సాహిత్య విమర్శ ఆరంభ వికాసాలను సోదాహరణంగా సమీక్షించండి.
4. నవీన్ రాసిన అంపశయ్య నవలను అనుశీలించడానికి మీరే విమర్శ పద్ధతులను అన్వయిస్తే సరిపోతుందని భావిస్తున్నారు? ఆ పద్ధతుల్లో ఆ నవలను విమర్శనాత్మకంగా చర్చించండి.
ఈ కింది ప్రశ్నలలో మూడింటికి లఘు వ్యాస రూప సమాధానాలను రాయండి.
5. సాహిత్య విమర్శ కళా? శాస్త్రమా? మీ అభిప్రాయాలను తార్కికంగా విశ్లేషించండి.
6.విమర్స- పరిశోధనల మధ్య గల భేద సాదృశ్యాలను సమీక్షించండి.
7.తులనాత్మక-వాదప్రతివాద విమర్శల మధ్య గల వ్య్త్తత్యాసాలను విశదీకరించండి.
8.తొలితెలుగు విమర్శకులలో కాశీభట్ల బ్ర్హ్మహ్మయ్య స్థానాన్ని అంచెనా వేయండి.
9.తెలుగులో గల కొంత మంది మార్క్సిస్టు విమర్శకులను పేర్కొని, వారి ప్రధాన రచనలను పరిచయం చేయండి.
10. విమర్శకుడికి నిబద్ధత, దృక్పథం అవసరమా? చర్చించండి.