Showing posts with label M.A. II Sem. Show all posts
Showing posts with label M.A. II Sem. Show all posts

Friday, March 14, 2014

కళాతత్త్వశాస్త్ర విద్యార్థులు: 2013-14

1.          13HTMA01           VARRI SURI BABU
2.          13HTMA31            R. SHRAVANA KUMAR
3.           13HTMA10           G. KRISHNA VENI
4.          13HTMA14           B.MADHAVI
5.           13HTMA 18         J MAHENDHAR
6.          13HTMA10           V SOMASEKHAR


Syllabus:


UNIVERSITY OF HYDERABAD
School of Humanities
DEPARTMENT OF TELUGU
M.A., Telugu, IV Semester - Optional Course
TL 477  COMPARATIVE AESTHETICS
Optional Courses: 4 Credits.                                           Course Teacher: Dr.Darla Venkateswara Rao
Mobile: 09989628049

తులనాత్మక  కళాతత్త్వ శాస్త్రం
పాఠ్యాంశలక్ష్యం : కళాతత్త్వ శాస్త్ర మౌలికాంశాలను గుర్తించి, భారతీయ, పాశ్చాత్య కళాతత్త్వ శాస్త్రాలలో గల ముఖ్యాంశాలను తులనాత్మకంగా వివరించడం  దీని ప్రధాన లక్ష్యం. తెలుగు సాహిత్యాన్ని చిత్రం, శిల్పం, సంగీతం, , కవిత్వం, నాట్యం అనే లలిత కళల సమన్వయ దృష్టితో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాఠ్యాంశాన్ని చదవడం వల్ల  విద్యార్థులకు సాహిత్యంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న లలితకళలతో గల భేద సాదృశ్యాల అవగాహన కలుగుతుంది. కళల పట్ల గల విశ్వజనీన భావనలను అర్థం చేసుకోగలుగుతారు. ఈ దిశగా అనేక రచనలు వెలువడ్డాయి. ఈ అధ్యయనం కళాతత్త్వ శాస్త్ర దృష్టితో పరిశోధనల చేయాలనుకునేవారికి, సాహిత్యాన్ని లలితకళలతో గల అవినాభావ సంబంధాన్ని పరిచయం చేస్తుంది. విద్యార్థులకు కళాతత్త్వశాస్త్ర మౌలిక భావనల పట్ల అవగాహన కలిగిస్తుంది.

యూనిట్‌ - 1
ఈస్తటిక్స్‌ - శబ్దార్థ వివరణ- నేపథ్యం, నామౌచిత్యం- తులనాత్మక కళాతత్త్వ శాస్త్ర మౌలికాంశాలు : సౌందర్యం, ప్రతిభ, అభివ్యక్తి.,   కవిత్వం - లలిత కళలు; కళాతత్త్వ శాస్త్రం- నిర్వచనం, లక్షణాలు; కళావిర్భావ సిద్ధాంతాల పరిచయం -  కళ, కళోత్పత్తి, అనుకరణ- కళా హేతువులు - కళాకారుని పక్ష అధ్యయనం, ప్రేక్షక పక్ష అధ్యయనం, ఇతర కోణాలు. ప్రతిభ, అభివ్యక్తి తదితర అంశాలు.

యూనిట్‌ - 2  
కళాతత్త్వశాస్త్రం - విమర్శశాస్త్రం భేద సాదృశ్యాలు, కళా తాత్త్వికులు - దార్శినికులు – ఆలంకారికులు

యూనిట్‌ - 3
పాశ్చాత్య కళాతాత్త్వికుల దృక్పథాల పరిచయం: ప్లాటో, అరిస్టాటిల్‌, బౌమ్‌గార్టెన్‌, కాంట్‌, హెగెల్‌, బొసాంకె, క్రోచీ, సుసన్నా కె.లాంగర్‌,  సాంతాయన, ఎమర్శన్‌, కాలరిడ్జ్‌ మొదలైన  దృక్పథాల పరిచయం.

భారతీయ కళాతాత్త్వికుల దృక్పథం: భరతుడు, భామహుడు, దండి, ఆనందవర్ధనుడు, వామనుడు, రాజశేఖరుడు, అభినవగుప్తుడు, మమ్ముటుడు, కుంతకుడు, భోజుడు, మహిమభట్టు, విశ్వనాథుడు, పండితరాజ జగన్నాథుడు, అరవిందుడు, రవీంద్రనాథ్‌ టాగోర్‌ మొదలైన వారి దృక్పథాలతో తులనాత్మక అధ్యయనం.


యూనిట్‌ - 4  
సత్యం - శివం - సుందరం పట్ల పాశ్యాత్య, భారతీయుల దృక్పథాలు.
సుందరం - సౌందర్యం భావనలు.
సౌందర్యం వస్తుగతమా?, వ్యక్తిగతమా? ఉభయగతమా?
లలితకళలను ఆస్వాదించడమెలా?
తులనాత్మక కళాతత్త్వశాస్త్ర విమర్శ  పద్ధతులు.

సంప్రదించదగిన గ్రంథాలు:   
1. విమర్శకపారిజాతం - పురాణం సూరిశాస్త్రి
2. కళాతత్వ్త శాస్త్రం : మౌలికాంశ వివేచన(తులనాత్మక అధ్యయనం) - ముదిగొండ వీరభద్రయ్య
3. ఆంధ్రసాహిత్య విమర్శ-ఆంగ్లప్రభావం –(జి.వి.సుబ్రహ్మణ్యం)
4. సంజీవ్‌దేవ్‌ వ్యాసాలు - సంపాదకులు: వి. కొండలరావు, ముదిగొండ వీరభద్రయ్య
5. పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు - వడలి మందేశ్వరరావు
6. కావ్యాలంకార సంగ్రహం. గ్రంథకర్త: రామరాజభూషణుడు – వివరణ కర్త: సన్నిధానము సూర్యనారాయణశాస్ర్తి
7. Comparative Aesthetics Vol.II – K.C. Pandey.
8. Cultural Leaders of India: Aestheticians – Publications Division, Ministry of Information and Broad Casting, Government of India, New Delhi, 1983.
9. Indian Aesthetics an Introduction – Edited by V.S.Seturaman

Wednesday, April 29, 2009

Modern Poetry - M.A. Telugu II sem Model paper

UNIVERSITY OF HYDERABAD
DEPARTMENT OF TELUGU
END- SEMESTER EXAMINATIONS APRIL 2009
M.A.Telugu, II SEMESTER
Course: HT – 529 Modern Poetry
Time: 3 Hrs Max.Marks: 60
కింది ప్రశ్నలలో నాలుగింటికి వ్యాస రూప సమాధానాలను రాయండి. ( 4x15 = 60 మార్కులు)
1. ఆధునిక కవిత్వ లక్షణాలను పేర్కొనండి.
2. భావకవులపై కాల్పనికోద్యమ ప్రభావాన్ని వివరించండి.
3. ఆధునికాంధ్ర కవిత్వ ధోరణులను పరిచయం చేయండి.
4. దేవులపల్లి కృష్ణ శాస్త్రి జీవితాన్ని పరిచయం చేసి, ఆయన కవితా దృక్పథాన్ని విశ్లేషించండి.
5. మహాప్రస్థానం కవితా సంపుటిలో గల శ్రీశ్రీ సామాజిక దృక్పథాన్ని సమీక్షించండి.
6. తిలక్ అమృతం కురిసిన రాత్రి లో గల భావాభ్యుదయ ధోరణులను సమన్వయించండి.
7. గబ్బిలం కావ్యంలో కనిపించే వస్తు శిల్ప ప్రత్యేకతలను రాయండి.
8. ప్రాచీన ఆధునిక కవిత్వ లక్షణాల్లో కనిపించే భేద సాదృశ్యాలను చర్చించండి.
-o-

Friday, January 23, 2009

ఆధునిక కవిత్వం (Modern Poetry): M.A. II Syllabus

హైదరాబాదు విశ్వవిద్యాలయం,
తెలుగు శాఖ,
HT 529: ఆధునిక కవిత్వం (Modern Poetry)
రెండవ సెమిస్టర్ - తప్పనిసరి పాఠ్యాంశం - నాలుగు క్రెడిట్లు

---------------------------------------------------------------------------------------------------------------------

యూనిట్: 1
ఆధునిక కవిత్వం- స్వరూప స్వభావాలు
ప్రాచీన - ఆధునిక కవిత్వ లక్షణాలు : భేద సాదృశ్యాలు
ప్రక్రియా వైవిధ్యం, ఆత్మాశ్రయ రీతి , వస్తు నవ్యత,
భావనవ్యత, శైలీ నవ్యత, పదప్రయోగ వైచిత్రి మొదలైన అంశాలు.
యూనిట్ 2
కాల్పనికోద్యమం: లక్షణాలు
భావ కవులపై కాల్పనికోద్యమ ప్రభావం
ఆధునికాంధ్ర కవిత్వం : ధోరణులు
భావకవిత్వం, అభ్యుదయకవిత్వం, విప్లవకవిత్వం, దిగంబరకవిత్వం, జాతీయోద్యమ కవితం మొదలైనవి
యూనిట్ 3
కృష్ణ పక్షం ( దేవుల పల్లి కృష్ణ శాస్త్రి),
అమృతం కురిసిన రాత్రి (బాలగంగాధర తిలక్),
మహాప్రస్థానం (శ్రీశ్రీ), గబ్బిలం ( గుర్రం జాషువ) కావ్యాలలో కొన్ని భాగాలు

చదువవలసిన గ్రంథాలు :
నవ్యాంధ్ర సాహిత్య వీధులు ( కురుగంటి సీతారామాచార్యులు, పి.హనుమంతరావు)
కవిత్వ తత్వ విచారము ( కట్టమంచి రామ లింగారెడ్డి)
ఆధునికాంధ్ర కవిత్వం- సంప్రదాయాలు : ప్రయోగాలు ( సి.నారాయణ రెడ్డి)
కవికోకిల గ్రంథావళి (వ్యాసాలు) దువ్వూరి రామిరెడ్డి
తెలుగు సాహిత్యంపై ఇంగ్లీషు ప్రభావము ( కొత్తపల్లి వీరభద్ర రావు)

ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు (కె.కె.రంగనాథాచార్యులు)
అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు ( పేర్వారం జగన్నాధం)
తెలుగులో కవితా విప్లవాల స్వరూపం ( వెల్చేరు నారాయణ రావు )
తెలుగు కవితా వికాసం ( కడియాల రామమోహన రావు)
స్వాతంత్ర్యానంతర తెలుగు కవిత:వస్తువు, రూపం, శిల్పం ( ఎస్. శరత్ జ్యోత్స్నారాణి)