Thursday, April 23, 2009

dalit literature model paper

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
School of Humanities
End Semester Examinations-November : 2008
M.A. Telugu, I Semester
Course : HT- 507 Dalit Literature
Time : 1.30 Hours Date: 25-11-2008 Max.marks: 30

కింది ప్రశ్నలలో మూడింటికి సమాధానాలు రాయండి. 3 10 30
1. దళిత సాహిత్యాన్ని నిర్వచించి, దళిత సాహిత్య చారిత్రక నేపథ్యాన్ని వివరించండి.
(లేదా)
దళిత సాహిత్యం మౌలిక అంశాలను వివరించి, వివిధ ప్రక్రియలను తెలపండి.
2. పంచమం నవలలో దళిత మార్క్సిస్టు దృక్పథాన్ని విశ్లేషించండి.
(లేదా)
పంచమం నవలలో దళితేతర పాత్రల స్వభావాన్ని పేర్కొనండి.
3. ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారు రాసిన కులవృత్తి కథలో కనిపించే దళిత తత్త్వాన్ని విశ్లేషించండి.
(లేదా)
కింది కవితా ఖండికలోని వస్తు, శిల్పాలను విశ్లేషించండి.
మయ సభలో నా ఆత్మకథ ఆవిష్కరించబడింది
బహిరంగ వేదిక మీద నా సన్మానం మొదలైంది
ఇప్పుడు నా మెడలో దండలు పడుతుంటే
నిన్నటి నా గాయాలు ఉలిక్కి పడుతుంటాయి
................
.....................
నా వెనక వేద మంత్రాలు నినదిస్తుంటే
నా చెవుల్లో సీసం పొగల గావుకేకలు తాండవిస్తుంటాయి
సభా వేదిక మీద నన్ను కూర్చోబెట్టినప్పుడు
ఊరి పొలిమేర దగ్గరే నిలబడ్డ నా తాత మొహం గుర్తుకొస్తుంది
నా ముందు నీళ్లు నిండిన గాజు గ్లాసులు పెట్టినప్పుడు
మోకలపై వొంగి నీళ్లు తాగిన ఎడారి దృశ్యాలు వేడిగా తగులుతాయి
......................
.........................
నాలుగు మబ్బుల నీలి గోడల్ని చీల్చుకుంటూ
నేను ఐదవ సూర్యుడినై ఉదయించాను
ఇవ్వాళ నా రక్త కిరణాలు
చంద్రతలం మీద ప్రతిఫలిస్తున్నాయి
ఇప్పటి కొత్త సూర్యుడి వెలుగులో
కాలం నా ఆత్మకథను
పాఠ్య గ్రంథంగా చదువుకుంటుంది
(ఆత్మకథ - ఎండ్లూరి సుధాకర్‌)

No comments: