Techniques of Writing a Dissertation

UNIVERSITY OF HYDERABAD
School of Humanities
Department of Telugu
M.A., Telugu   (III Semester)
Techniques of Writing a Dissertation-1 (Theory)
Optional: 4 Credits
100 Marks (Internal 40 + Main 60 marks for End semester)

Course Design by Dr.Darla Venkateswara Rao
Email: darlahcu@gmail.com

పాఠ్యాంశ లక్ష్యం:
ఎం.ఏ స్థాయిలోనే విద్యార్థులకు పరిశోధనకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం ఎంతో అవసరం. కొంతమంది అనేక కారణాల వల్ల ఎం.ఏ., తర్వాత వెంటనే పరిశోధనలో చేరలేకపోవచ్చు. అటువంటి వాళ్ళు కూడా పరిశోధన పట్ల అవగాహన ఉంటే పత్రికల్లో కొన్ని పరిశోధన వ్యాసాలను రాయవచ్చు. పత్రికల్లో వస్తున్న పరిశోధనాంశాలకు సంబంధించి అవసరమైతే తమకి తెలిసిన అంశాలపై చర్చలో పాల్గొనవచ్చు. అటువంటప్పుడు ఆ చర్చలు, ఆ వ్యాసాలు శాస్త్రీయంగా రాయగలిగే అవకాశం ఉండాలి. అలా ఉండాలంటే ఎం.ఏ.స్థాయిలోనే పరిశోధన పత్ర రచన పట్ల కనీస అవగాహన అవసరం. అందుకనే హైదరాబాదు విశ్వవిద్యాలయం బోధన, పరిశోధనలకు సమప్రాధాన్యాన్నిస్తుంది. దీనిలో భాగంగానే ఈ కోర్సుని చదివే వారికి పరిశోధన పట్ల అవగాహనను కలిగిస్తుంది. 
గమనిక: జాతీయ విద్యావిధానం-2020 ప్రకారం మారిన సిలబస్ లో Techniques of Writing a Dissertation-1 (Theory) అనే పేపర్ IIIrd Semester లోను, Techniques of Writing a Dissertation-II ( Practical) IV సెమిస్టర్ లోను ఉంటుంది. మూడవ సెమిస్టర్ 2022 ఆగస్టు నుండి ఈ మార్పు మొదలవుతుంది. టైటిల్ లో కూడా చిన్న మార్పు జరిగింది. దాన్ని గమనించండి. 

UNIT-I
సాధారణ వ్యాసం (General Essay)-సమీక్ష వ్యాసం(Review Essay)-పరిశోధన పత్రం (Research Paper) : నిర్వచనాలు (Definitions), లక్షణాలు (Features), లక్ష్యాలు (Aims), ఆశయాలు (Objectives), పరిశోధన నివేదిక   (Research Report), సిద్ధాంత వ్యాసం (Dissertation), సిద్ధాంత గ్రంథం (Thesis), పరిశోధన స్వరూపం, (Research Structure), పరిశోధన స్వభావాలు (Research Characteristics)

UNIT-II
పరిశోధన ప్రణాళిక  (Research Plan) - పరిశోధన సంక్షిప్తి (Research Abstract)- పరిశోధనాంశం (Research Topic) ఆధారాలు (Sources): ప్రాథమిక (Primary) , మాధ్యమిక ( Secondary),  ప్రకటనలు  (Statements )- ఉద్దరణలు (Quotations) సూచికలు (Citations) - పాద సూచికలు, (Foot Notes), అంతర్గత సూచికలు,  (Inner Notes), అంతర్జాల వాడుక (Usage of Internet),  ఉపయుక్త గ్రంథ సూచిక (Bibliography) - భాష, శైలి (Language and Style) - విరామ చిహ్నాలు (Punctuation Marks),  గ్రంథాలు,  పత్రికల పేర్లు (Names of Books, Journals)


UNIT-III
గుణాత్మక, పరిమాణాత్మక పద్ధతులు (Qualitative and Quantitative Methods), భావన (Concept), సాధారణ సిద్ధాంతం (General Theory), ఊహ పరికల్పన (Hypothesis), సిద్ధాంత నిరూపణ పరికరాలు (Research Tools), ఫలితాంశాలు (Results),  ప్రత్యక్ష లేదా నిగమన పద్ధతి (Deductive Method), పరోక్ష లేదా  ఆగమన పద్ధతి (Inductive Method)

UNIT-IV
ఉపోద్ఘాతం (Writing the Introduction) ముఖ్య ప్రతిపాదిత విషయం (Writing the Body)- ముగింపు (Writing the Conclusion)- తొలి చిత్తు ప్రతి (Write the first Draft)- ప్రాథమిక ప్రతి (Revised first Draft or Outline)- అసలు ప్రతి (Final Draft)
 Reference Books of Further Reading
  • ·         Joseph Gibaldi. MLA Handbook for Writers of Research Papers (7th Edition), The Modern Language Association of America. Printed in the United States of America, New York 10004-1789
  • · Jonathan Anderson & Millicent Poole, Assignment and Thesis Writing, 2011

  • ·         ఎస్‌. జయప్రకాష్‌.  పరిశోధన విధానం,  1992
  • ·         జి.వి., సుబ్రహ్మణ్యం. జీవియస్‌ వ్యాసాలు,  1993
  • ·         ఆర్వీయస్‌. సుందరం.  పరిశోధన పద్ధతులు 1990
  • ·         రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, హెచ్‌.ఎస్‌.బ్రహ్మానంద, సాహిత్య పరిశోధన సూత్రాలు, 1997
  • ·         నిత్యానందరావు, వెలుదండ. విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన, 2014
  • ·         సుబ్బాచారి,పులికొండ. పరిశోధన విధానం సిద్ధాంత గ్రంథ రచన, 2014
  • ·         అప్పారావు గంధం, సూర్యనారాయణ, కాళిదాసు. పరిశోధన పద్ధతులు, 1985
  • ·         తెలుగు అకాడమి, పరిశోధన సంహిత, 1975.
  • ·         కుసుమాబాయి, కులశేఖరరావు, పరిశోధన సూత్రాలు,2000.
  • ·         లక్ష్మీనారాయణ, గంగిశెట్టి. ఆధునికత -సమకాలికత(కొన్ని పార్శ్వాలు),2016

Techniques of Writing a Dissertation-1 (Theory) ... Model Questions 

వ్యాసరూప సమాధానాలు :

  • పరిశోధన అంటే ఏమిటి? సాహిత్య పరిశోధనలో పాటించే ముఖ్యమైన పద్ధతులను వివరించండి?

  • సాధారణ వ్యాసానికి, సమీక్ష వ్యాసానికి, పరిశోధన వ్యాసానికి మధ్య గల తారతమ్యాలని విశ్లేషించండి?

  • పరిశోధన /పరిశోధకునికి ఉండవలసిన ఉత్తమ లక్షణాలను పేర్కొనండి?

  • పరిశోధన ప్రణాళిక అంటే ఏమిటి? ఏదైనా మీకు నచ్చిన ఒక అంశంపై పరిశోధన ప్రణాళికను రాయండి?

  • సిద్ధాంత గ్రంథం స్వరూప స్వభావాలను తెలియజేయండి?

  • పరిశోధనలు ఉపయోగించే వివిధ ఆధారాలను వర్గీకరించి సోదాహరణంగా వివరించండి?

  • పరిశోధనలో సూచికలు (citations) ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారో సోదాహరణం గా వివరించండి?

  • పరిశోధనలో ఉపయోగించే శైలీ పత్రం ప్రాధాన్యాన్ని తెలిపి "MLA", "APA" లను పరిచయం చేయండి?

  • పరిశోధనలో "Review of the Literature" ఆవశ్యకతను తెలపండి?

  • పరిశోధనలో గుణాత్మక (Qualitative), పరిమాణాత్మక (Quantitative) పద్ధతులను సోదాహరణంగా వివరించండి?

  • నిగమన(Deductive method), ఆగమన(Inductive method)లను సోదాహారణంగా వివరించండి?

  • లఘు సమాధాన ప్రశ్నలు:

  • ఊహ పరికల్పన (Hypothesis)

  • ఉపయుక్త గ్రంథ సూచి (Bibliography)

  • పరిశోధన మరియు పరిశోధన లక్షణాలు

  • విమర్శ -పరిశోధన 

  • పరిశోధనా నివేదిక(Research report)

  • పరిశోధన సంక్షిప్తి (Research abstract) 

  • పరిశోధనలో ‌‌ప్రకటనలు (Statements)

  • పరిశోధనా ఫలితంశాలు(Research results)

  • Five elements of a Research Paper


No comments: