ఎం.ఏ.,తెలుగు తరగతులు ప్రారంభమయ్యాయి. నాల్గవ సెమిస్టర్ లో కొత్తగా Techniques of Writing a Thesis/Dissertation అనే కోర్సు ప్రవేశ పెట్టడం జరిగింది. దీనితో పాటు రెండవ సెమిస్టర్ విద్యార్ధులకు ‘‘ప్రవాసాంధ్ర సాహిత్యం-పరిచయం’’ అనే కోర్సుని కూడా డా.దార్ల వెంకటేశ్వరరావు బోధిస్తారు.

Saturday, July 16, 2016

పంపన మనవాడే! ( నమస్తేతెలంగాణ సౌజ్యంతో...)


PUBLISHED: SUN,JULY 17, 2016 02:18 AM
 -తెలంగాణ తెలుగుకు వెయ్యేండ్లకు పైగా ప్రాచీనత
-నన్నయకు వందేండ్లకు ముందే పద్యరచన
-నాలుగు తెలుగు కావ్యాలు రాసిన పంప మహాకవి
 
-కన్నడ సాహిత్యంలో ఆదికవిగా చిరకీర్తి
-బోధన్, ధర్మపురి, కురిక్యాల శాసనాల్లో వివరాలు
-తెలుగు ప్రాచీనత గుర్తింపునకు మార్గం సుగమం
-క్రీ.శ. 931నాటి విక్రమార్జున విజయంలో ప్రస్తావన
-ఆంధ్ర చేతులెత్తేస్తే ఆధారాలిచ్చి ఆదుకున్న తెలంగాణ
 

వెయ్యేండ్లకు పూర్వమే ఈ నేల మీద తెలుగు సాహిత్యం పరిఢవిల్లింది. పుంఖానుపుంఖాలుగా కావ్యరచన సాగింది. ఆంధ్రులు చెప్పుకునే ఆదికవి నన్నయకు వందేండ్లకు ముందే ఈ గడ్డ మీద పంప మహాకవి తెలుగు కావ్యాలు రాశారు. త్రిభాషా ప్రవీణుడైన ఆ మహాకవిని కన్నడ సాహిత్యం కన్నడ ఆదికవిగా గుర్తింపునిస్తే ఆంధ్ర ఆధిపత్య వర్గాలు ఆదికవిగా కాదు.. కనీసం తెలుగుకవిగా కూడా గుర్తించలేదు. సత్యం చరిత్ర గర్భం చీల్చుకుని బయటికి వస్తుంది. ఇవాళ తెలుగు ప్రాచీనత నిరూపణకు ఇదే పంపన సాహిత్యం ఆధారంగా మారుతున్నది. మద్రాసు హైకోర్టులో తెలుగు ప్రాచీనత కేసులో ఏపీ చేతులెత్తేస్తే తెలంగాణ పంపన రచనలు, అనేక శాసనాలు సమర్పించింది. ఒకనాడు తెలంగాణ సాహిత్యాన్ని గుర్తించ నిరాకరించిన ఆధిపత్య తెలుగుకు ఇపుడు పంపన సాహితీ జిలుగులే ఆధారం కావడం సత్యమేవ జయతే అన్న నానుడిని గుర్తుకు తెస్తున్నది.నాగవర్ధన్ :రాయల తెలంగాణ ప్రాంతంలో తెలుగు సాహిత్యానికి వెయ్యేండ్ల ప్రాచీనత ఉంది. ఆంధ్రులు ఆదికవిగా చెప్పుకున్న నన్నయ్యకు వందేండ్ల ముందే ఇక్కడ మహాకవి పంపన నాలుగు తెలుగు కావ్యాలు రాసినట్టు ఆధారాలు ఉన్నాయి. దేశీ కవిత్వానికి, కంద పద్యానికి ప్రాచీన మూలాలు తెలంగాణలోనే లభ్యమయ్యాయి. కన్నడ సాహిత్యంలో ఆదికవిగా ప్రాచుర్యం పొందిన వేములవాడ చాళుక్య రాజుల ఆస్థాన కవి పంపన తెలుగులోనూ నాలుగు కావ్యాలు రాసినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. తెలుగులో ఆదికవిగా ప్రచారం చేసిన నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు కాగా, పంపన క్రీ.శ. 902 నుంచి 975 మధ్యకాలంలో జీవించారు.
 


తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో కావ్య రచన చేసిన పంపమహాకవి తెలుగువాడు. ఆయన పూర్వీకులు కమ్మనాడు(గుంటూరు)లోని వేంగిపర్రు ప్రాంతం నుంచి సబ్బినాడు(కరీంనగర్) ప్రాంతానికి వలస వచ్చారు. ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డ పంపన వృద్ధాప్యంలో బోధన్‌లో జీవసమాధి పొందారు. కన్నడ సాహితీకారులు ఆయనను కన్నడ ఆదికవిగా అక్కున చేర్చుకోగా తెలుగువారు మాత్రం విస్మరించారు. తెలంగాణ స్వరాష్ర్టాన్ని పునర్నిర్మించుకుంటున్న తరుణంలో పంపమహాకవి మూలాలపై పరిశోధనలు ముమ్మరం చేసింది.
 

క్రీ.శ. 931 నాటికే తెలుగులో కావ్యాలు.. 

వేములవాడ చాళుక్య రాజులలో ప్రసిద్ధుడు రెండవ అరికేసరి. ఆయన సాహిత్య ప్రియుడు. ఆయన ఆస్థానంలోని కవులలో పంపన ఒకడు. కన్నడ భాషలో విక్రమార్జున విజయం, ఆదిపురాణం అనే కావ్యాలను రచించారు. ఇందులో ఆదిపురాణం జైన తీర్థంకరుల కథ కాగా, విక్రమార్జున విజయం మహాభారత కథకు స్వేచ్ఛానుసృజన. పదహారు వందల ఏడు పద్యాలతో సాగిన ఈ కావ్యానికి విక్రమార్జున విజయం అని పంపన నామకరణం చేసినా, అది జనబాహుళ్యంలో పంప భారతంగా ప్రసిద్ధికెక్కింది. వ్యాస మహాభారతంలో శ్రీకృష్ణ పాత్రకు ప్రాధాన్యం ఉంటే, పంప భారతంలో అర్జునుడే కథానాయకుడు.
 

ఆ రకంగా వ్యాస భారతాన్ని కేవలం కన్నడీకరించడం కాకుండా స్వీయ భారత పురాణ పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రాచీన కవులు, గ్రంథకర్తలు ఏ రచననైనా ముందు దేవతా ప్రార్థన, ఆ తర్వాత తమ వంశ,గోత్ర నామ విశేషాలు వెల్లడిస్తూ రచన కొనసాగించడం ఒక సంప్రదాయం. 19వ శతాబ్ద ప్రారంభదశ వరకూ ఈ ఆనవాయితీ కొనసాగింది. క్రీ.శ. 931లో రాసిన విక్రమార్జున విజయం, ఆదిపురాణంలో పంపన తన వంశ, గోత్రనామ విశేషాలతో పాటు తన గత రచనలను కూడా ప్రస్తావించారు. కన్నడ కావ్యాలతోపాటు తన మాతృభాష అయిన తెలుగులో నాలుగు గ్రంథాలను రాసినట్లుగా పేర్కొన్నారు. దీని ఆధారంగా ఆ కాలం నాటికే తెలుగు సాహిత్యం ఉందని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ గుర్తించింది.
 
ప్రాచీన కావ్యం.. జినేంద్ర పురాణం 

పంపనకు, నన్నయ్యకు వందేండ్లకుపైగా వ్యత్యాసం ఉంది. కానీ ఆంధ్రుల పాలనలో తెలుగు సాహిత్య చరిత్రకు నన్నయే ఆదికవిగా నిలిచిపోయాడు. కురిక్యాల, బోధన్, ధర్మపురి ప్రాంతాల్లో లభించిన శిలాశాసనాలపై ఉన్న పద్యాలు పంపన సాహిత్యాన్ని పరిచయం చేస్తూనే ఉన్నా.. ఆ కావ్యాల అధ్యయనం, పరిశోధనపై జరుగాల్సిన కృషి జరుగలేదు. ఇంతదాక తెలుగు సాహిత్య చరిత్రపై జరిగిన పరిశోధనలన్నీ 950 సంవత్సరాలు (నన్నయ కాలం) దాటి వెనక్కిపోలేదు. తెలుగు సాహిత్యంలోని పద్మకవి, పద్మప్ప పేర్లతో ఉన్న కవి కూడా పంపనయేనని పలువురు సాహిత్య పరిశోధకులు అభిప్రాయపడ్డారు. పంపనకు పంప, పంపడు పేర్లుకూడా ఉన్నాయి. పంపనయే పద్మకవి అని నిడదవోలు వెంకటరావు పేర్కొన్నారు. క్రీ.శ. 941లో పద్మకవి (పంపన) రచించిన జినేంద్ర పురాణంగురించి వేటూరి ప్రభాకర శాస్త్రి తన ప్రబంధ రత్నావళిలో ప్రస్తావించారు. అందులోని ఓ సీస పద్యం ఇలా ఉంది..
 హరినిలయంబును హరినిలయంబును - విషధరాఢ్యంబును విషధరాడ్య
మప్సరోమయమును నప్సిరోమయమును - వన విలాసమును పావన విలాస
మున్నత కరిశృంగ మున్నతి కరిశృంగ - మిందు కాంత స్రవమిందు కాంత
 
మురుకలనకులంబు నురుకలనకులంబు - నంశుకాంత ద్యోతి నాంశుకాంత
 
మొనర నవశత సాహస్రయోజ నోన్న
 

తమును పదివేల యోజనా/లమరు/వలము
గలిగి కనాకాద్రికిన్నూటగలిగితనరి
ప్రధితమై యెప్పు మందర పర్వతంబు
 
పంపన పూర్వీకులు తెలుగువాళ్లే..! 

కన్నడ సాహితీ సృజన వల్ల పంపన తెలుగువాడా కాడా అనే సందేహాలు ఉన్నా వాటిని పటాపంచలు చేస్తూ పంపనకు సంబంధించిన జీవిత విశేషాలను తెలియజేసే శాసనం కురిక్యాల (కరీంనగర్ జిల్లా)లో లభించింది. ఇది 10వ శతాబ్దానికి సంబంధించిది. దీన్ని పంపన తమ్ముడు జినవల్లభుడు వేయించాడు. ఈ శాసనం ద్వారానే కంద పద్యం వెలుగులోకి వచ్చింది. తమ కుటుంబం వేంగిపర్రు నుంచి వలస వచ్చినట్లుగా ఈ శాసనంలో పేర్కొన్నాడు. తన తండ్రి భీమప్పయ్య, తాత అభిమాన చంద్ర అని తాము బ్రాహ్మణ కులానికి చెందిన వారమని, వైష్ణవ మతాన్ని వీడి జైన మతాన్ని స్వీకరించామని ఆ శాసనంలో పేర్కొన్నాడు.
 

దీన్ని బట్టి పంపన తండ్రి భీమప్పయ్య వేంగీపురం (నేటి బాపట్లకు సమీపంలోని వంగిపర్రు) ప్రాంతానికి చెందినవాడని, ఆ కుటుంబం వంగిపర్రు అగ్రహారాన్ని వదిలివేసి సబ్బినాడు లేదా సబ్బిమండలం (కరీంనగర్ ప్రాంతం)కు వలస వచ్చిందని అర్థమవుతుంది. కాగా కర్ణాటకలోని బావనాసిలో పంపన బాల్యం గడిచిందని, తర్వాత వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో చేరాడని తెలుస్తున్నది. సాహితీ ప్రియుడైన అరికేసరి కొలువులో మహాభారతాన్ని విక్రమార్జున విజయం పేరుతో రచించి ఆయనకే అంకితమివ్వటంతో రాజు పంపనకు సబ్బినాడు మధ్యలో ఉన్న ధర్మపురిని అగ్రహారంగా ఇచ్చినట్లు ధర్మపురి పట్టణంలో లభించిన శాసనం తెలియచేస్తున్నది.
 


ధర్మపురి పొలిమేరలో ఉన్న వృషభాద్రిపై పంపన జీవిత విశేషాలను తెలియజేస్తూ ఆయన తమ్ముడు జినవల్లభుడు శాసనం వేయించాడు. ఈ శాసనంలోని పద్యాలు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలో ఉన్నాయి. ఇందులోని సారాంశం ప్రకారం జినవల్లభుడు తన అన్న పంపనకు స్మారకంగా త్రిభువన తిలక అనే పేరుతో వసతి గృహాన్ని, మదన విలాస అనేపేరుతో ఉద్యానవనాన్ని నిర్మించాడు. వృషభాద్రి కింద చెరువు తవ్వించి దానికి కవితా గుణార్ణవ అని పేరుపెట్టాడు. చక్రేశ్వరీ దేవి, ఇతర జైన దేవతల విగ్రహాలు చెక్కించి పంపన సేవలను తెలియజేస్తూ శాసనం చెక్కించాడు. ఈశాసనాలపై ఉన్న తెలుగు పద్యాలు తెలుగు సాహిత్య ప్రాచీనతను నిరూపిస్తున్నాయి.
 
హోదా రావటం ఖాయం..

తెలుగుకు ప్రాచీన హోదా దక్కడం ఖాయమని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక, పర్యాటక, క్రీడా, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ధీమా వ్యక్తం చేశారు. ఈ హోదా వల్ల వచ్చే వంద కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లోనే ప్రాచీన భాషా పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని వారు తెలిపారు. పంపన తెలుగులో నాలుగు గ్రంథాలు రాశారని, వాటిలో మూడు మద్రాస్ ఆర్కైవ్స్‌లో మరికొన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయని, ఒక గ్రంథానికి సంబంధించిన వివరాలు లభించలేదని భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణ నమస్తే తెలంగాణకు చెప్పారు.
 - ఫొటో కర్టెసీ: రాష్ట్ర పురావస్తుశాఖ సంచాలకులు
ప్రాచీన హోదాకు పంపన్న తొవ్వ

ఆధిపత్య భావజాలంలో తెలంగాణ తెలుగు సాహిత్యాన్ని విస్మరించిన గత తెలుగు పాలకులు నన్నయ్యే ఆదికవి అనే వాదనను పట్టుకు వేలాడి తెలుగు భాషకు ప్రాచీన హోదా తేవటంలో విఫలమయ్యారు. ప్రాచీన హోదాకు సాహిత్యానికి వెయ్యేండ్లు, భాషకు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉండాలి. తెలుగుకు ప్రాచీన హోదాపై మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం నడుస్తున్నది. నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్నయ్యను ఆదికవిగా, ఆంధ్రమహాభారతాన్ని తొలి కావ్యంగా వాదనలు చేసింది. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందిన కవి కావడంతో తెలుగు సాహిత్య చరిత్రకు వెయ్యేళ్ల ప్రాచీనతను చూపలేకపోయింది. ఆ తర్వాత వాదనలకు దూరంగా ఉండిపోయింది. రెండేండ్ల క్రితం ఆ కేసు విచారణకు హాజరుకావాలని రెండు తెలుగు రాష్ట్రాలకు నోటీసులు అందాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించకున్నా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుపై ఆసక్తితో అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.
 

ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య ఆదేశంతో భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణ తెలంగాణ తెలుగు భాషకు ఉన్న ప్రాచీనతను కోర్టుకు వివరిస్తూ అఫిడవిట్ రూపొందించారు. నన్నయకు పూర్వం ఉన్న కవిత్వానికి సంబంధించిన ఆధారాలను తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సేకరించింది. ఉట్నూరు, కోటిలింగాల, ధూళికట్ట ప్రాంతాల్లో లభించిన ప్రాచీన శాసనాల భాష ఆధారంగా తెలుగుకు 2 వేల సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉందని కోర్టుకు నివేదించింది. పంపనకంటే ముందే తెలుగు సాహిత్యం ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదన వినిపించింది.
 
pampana2


కరీంనగర్ జిల్లాలోని కురిక్యాలలో లభించిన 10 శతాబ్దానికి చెందిన శాసనంలో లభించిన కంద పద్యాన్ని కౌంటర్ అఫిడవిట్‌లో ప్రస్తావించారు. జినవల్లభుడు వేయించిన ఈ శాసనంతోపాటు మరికొన్ని శాసనాలను ప్రస్తావించారు. కన్నడ ఆదికవి పంపనను తెలుగు వాడిగానే కాక తెలుగు కవిగానూ గుర్తించాల్సిన అవసరాన్ని చెప్తూ కోర్టుకు ఆయన రాసిన గ్రంథం జినేంద్ర పురాణం వివరాలతోపాటు, పురాణంలోని అందుబాటులో ఉన్న పద్యాలను కోర్టుకు నివేదించారు. శాతవాహనుల శాసనాల ఆధారంగా తెలుగుకు భాష చరిత్ర, పంపన సాహిత్యం ఆధారంగా ప్రాచీనత వెలుగులోకి రావడంతో తెలుగుకు ప్రాచీన హోదాపై ఉన్న అభ్యంతరాలు క్రమంగా తొలిగిపోతున్నాయి.
 
బోధన్‌లో జీవ సమాధి..


పంపన తన కవిత్వాన్ని చాళుక్య రాజులకు అంకితమిచ్చాడు. చాళుక్యులు కన్నడిగులు కావడంతో కన్నడనాట రాజ్యాలు మారినా ఆయన సాహిత్యం ప్రాచుర్యంలోనే ఉండగలిగింది. వృద్ధాప్యంలో సన్యసించిన పంపన బోధన్‌లో సజీవ సమాధి అయ్యాడు. ఆ సమాధి వద్ద ఆయన జీవిత విశేషాలు, మరణ కాలాన్ని తెలిపే శాసనం ఉంది. ఆ శాసనంలో సైతం తెలుగు, కన్నడ, సంస్కృత భాషలో పద్యాలున్నాయి. కన్నడ సాహిత్యానికి అతి పురాతనమైన కవిత్వాన్ని అందించిన పంపన కన్నడ భాషలో ఆదికవిగా నిలిచిపోయాడు. తెలుగువాడైన పంపన తెలుగులోనూ రచనలు చేసినట్లుగా ఆధారాలున్నా, జైన, బౌద్ధ సంస్కృతి వర్ధిల్లిన నిజామాబాద్, కరీంనగర్‌లో ఆ కాలానికే తెలుగు సాహిత్యం ఉన్నట్లుగా పలు ప్రదేశాల్లో ఆధారాలు లభించినా.. తెలుగు సాహిత్యం మాత్రం పంపనను ఆదికవిగా కాదు, కనీసం తెలుగు కవిగా కూడా గుర్తించలేదు.


Friday, April 15, 2016

INTRODUCTION TO TELUGU DIASPORA LITERATURE

UNIVERSITY OF HYDERABAD
School of Humanities
Department of Telugu
M.A., Telugu   (IV Semester)
New Course Syllabus: TL 529 INTRODUCTION TO TELUGU DIASPORA LITERATURE
(ప్రవాసాంధ్ర సాహిత్యం-పరిచయం)
Optional Course: 4 Credits                                    
100 Marks (Internal 40 + Main 60)

కోర్సు లక్ష్యాలు:
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంలో అనేకయేళ్ళ పాటు గానీ, శాశ్వతంగా గాని నివసించేవాళ్లు, తాము పుట్టి పెరిగిన ప్రాంతం మారడం ద్వారా కలిగిన తమ జీవితానుభవాల్ని ఏదొక ప్రక్రియలో రాస్తే దాన్ని డయాస్పోరా సాహిత్యం అంటారు. ప్రాంతం అనేది గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం అనే విస్తృతమైన అవగాహనతో అవగాహన చేసుకోవాలి. కానీ, ప్రస్తుతం కేవలం ఒక దేశం నుండి మరొక దేశానికి రకరకాల కారణాల వల్ల వెళ్ళి అక్కడ నివసిస్తూ, తమ అనుభవాలను సృజనీకరించే సాహిత్యాన్ని డయాస్పోరా సాహిత్యంగా పిలుస్తున్నారు. ఈ రెండు కోణాల్నీ ఈ కోర్సులో అధ్యయనం చేస్తారు.  
ఈ కోర్సులో తెలుగు ప్రజలు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళినప్పుడు వారు ప్రత్యక్షంగా గమనించి రాసే సృజనాత్మక రచనను అధ్యయనం చేయడం ప్రధాన లక్ష్యం. దీనితో పాటు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల్లో వచ్చిన పరిణామాలను పరిశీలించడం. తెలుగు సాహిత్య వికాసంలో వస్తు, రూపవిశేషాలను శాస్త్రీయంగా సమీక్షించుకోవడం, తెలుగు ప్రజల చారిత్రక మూలాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు మొదలైన అంశాలను శాస్త్రీయంగా పరిశీలించడం ఈ పాఠ్యాంశ లక్ష్యాలు.

UNIT-I
డయాస్పోరా సాహిత్యం - వలసవాద సాహిత్యం –వలసాంధ్ర సాహిత్యం - ప్రాంతేతర ఆంధ్ర సాహిత్యం మొదలైన పర్యాయ పదాల సమీక్ష : డయాస్పోరా సాహిత్యం నిర్వచనం - లక్షణాలు
UNIT –II
పాశ్చాత్య నాగరికత-సంస్కృతి: భారతీయ విలువలు – తెలుగు వారి జీవన విధానం-ద్విపౌరుషత్వం- వైయక్తిక, వ్యవస్థీకృత సంఘర్షణలు- కుటుంబం-వివాహం- తెలుగు వారిగా తమ ఉనికి కోసం చేసే కార్యక్రమాలు - భాష, సాహిత్యం, కళలు - ప్రత్యేక సభలు, సమావేశాల నిర్వహణ-పండుగలు- మతాచారాలు- సాంస్కృతిక సమైక్యతా ప్రయత్నాలు- పుట్టి, పెరిగిన ప్రాంతాలపై మమకారం – నాస్టాల్జియా (Nostalgia)- వ్యాపారాభివృద్ధి-ఆర్థిక, రాజకీయ శక్తులుగా మారడం-విధాన నిర్ణయాలపై ప్రభావాన్ని వేయడం- స్వీయానుభవ సృజన సాహిత్య ప్రతిఫలనం.
భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో తెలుగు ప్రజల సాహిత్యం స్థితిగతుల ప్రతిఫలన డయాస్పోరా సాహిత్యం - ఇతర దేశాల్లో తెలుగు ప్రజల సాహిత్యం స్థితిగతుల ప్రతిఫలనం- విశ్వ సాహిత్యంలో తెలుగు స్థానం- మొదలైన అంశాల పరిచయం.
UNIT –III
పాఠ్య నిర్ణాయక గ్రంథాలు (Texts for Prescribed)
డయాస్పోరా నవలలు :  1. పడమటి కొండలు - రచయిత: డా. ఎస్. శంకరయ్య, 
          (శ్రీరామలక్ష్మి పబ్లికేషన్స్, హైదరాబాద్, ప్రథమ ప్రచురణ : జూన్ 2010)

          డయాస్పోరా కవిత్వం: 1. వలసలు (సంగెవేని రవీంద్ర), 
                                      2. నాపేరు... (అఫ్సర్)                                             
డయాస్పోరా కథలు :
పైచదువు (కేన్యా టు కేన్యా కథాసంపుటి) - ఆరి సీతారామయ్య,
అంటు-అత్తగారు – వేలూరి వెంకటేశ్వరరావు,  
రంగు తోలు - నిడదవోలు మాలతి,
సంకట్ కాలమే బాహర్ జానే కా మార్గ్ -వంగూరి చిట్టెన్ రాజు,
పండుగ- నోరి రాధిక,  
ఛోటీ దునియా  (కథ)– అఫ్సర్,
హోమ్ రన్ – కల్పనా రెంటాల,
శ్రీకారం  - అంబల్ల జనార్ధన్,
             
UNIT –IV
ప్రవాసాంధ్ర సాహిత్య సంస్థలు, పత్రికలలో భాషా సాహిత్యాంశాల పరిచయం
            సంస్థలు: భాషా సాహిత్య సేవ
        ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుల ప్రత్యేక సంచికలు, వారు ప్రచురించిన ప్రవాసాంధ్ర సాహిత్యం
          TANA( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రత్యేక సంచికలు
ATA (అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రత్యేక సంచికలు
వాటి ప్రత్యేక సంచికల పరిచయం
 పత్రికలు: ఈ మాట (http://eemaata.com/em/),
డయాస్పోరా రచయితలు: పరిచయం , అంతర్జాలంలో తెలుగుభాషా సాహిత్యాలు
            చదువుకోవాల్సిన గ్రంథాలు/రచనలు:       
1.    నా భావనలో డయాస్పోరా (వ్యాసం), వేలూరి వేంకటేశ్వరరావు, ఈ మాట మాసపత్రిక, (అంతర్జాల పత్రిక), నవంబరు, 2002.
2.    వలస రచయితలు- సాహిత్యం చైతన్యం (వ్యాసం), కొలకలూరి ఇనాక్, ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యంపై విమర్శనం, (సంపా) కొలకలూరి మధుజ్యోతి, జ్యోతి గ్రంథమాల, తిరుపతి: 2009, పుటలు: 182-189.
3.    తెలుగు డయాస్పోరా సాహిత్యం - ఒక పరిచయం (వ్యాసం), దార్ల వెంకటేశ్వరరావు, ద్రావిడి (త్త్రైమాసిక తెలుగు పరిశోధన పత్రిక) ఆగస్టు, 2011, సంపుటి-1, సంచిక-1. పుటలు: 114 –123.
        English Books:
Rainer Bauböck and Thomas Faist (ed.). Diaspora and Transnationalism: Concepts, Theories and Methods, IMISCOE Research, Amsterdam University Press, 2010.

Gijsbert Oonk (ed.). Global Indian Diasporas : Exploring Trajectories of Migration and Theory, IIAS Publications, Amsterdam University Press, 2007.


Laura Chrisman. Postcolonial contraventions Cultural readings of race, imperialism and transnationalism, Manchester University Press, 2003

Wednesday, December 02, 2015

జి.వి.రత్నాకర్ ‘అట్లేటి అల’ - పరిశీలన Studies in Specialized Area

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 602, Studies in Specialized Area
End Semester Examinations-November: 201
5
Time: 3 Hours               Max.marks: 60
     ------------------------------------------------------------------------------------------------------
Student:           Mr. G. Srinu, Roll No: 15HTHL11             
      -----------------------------------------------------------------------------------------------------
                                                                                   

పరిశోధనాంశం:
జి.వి.రత్నాకర్ ‘అట్లేటి అల’ - పరిశీలన

                        కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ( 3 x 20 = 60)        
1.    ఆధునిక తెలుగు కవిత్వంలో కనిపించే రూప పరిణామాన్ని వివరించండి.
2.    ఆధునిక దీర్ఘకావ్యాల స్వరూప, స్వభావాలను పేర్కొనండి.
3.    కావ్యం, దీర్ఘకావ్యాల మధ్య గల భేదాలను సోదాహరణంగా తెలపండి.
4.    కావ్య సౌందర్యాభివ్యక్తిలో ప్రతీక, భావచిత్రాల పాత్రను వివరించండి.
5.    దీర్ఘకావ్యాలపై జరిగిన పరిశోధనను సమీక్షించండి.

- ) 0 (-

మను,వసు చరిత్రల విమర్శ వ్యాసాలు – పరిశీలన Studies in Specialized Area

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 602, Studies in Specialized Area
End Semester Examinations-November: 201
5
Time: 3 Hours                                  Max.marks: 60
----------------------------------------------------------------------------------------------------------------------------
Student Name & Roll NO: I.Sumalatha  15HT HL02
-------------------------------------------------------------------------------------------------------------------------------

పరిశోధన అంశం
మను,వసు చరిత్రల విమర్శ వ్యాసాలు పరిశీలన

కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి (3 x 20 =60)
1. తెలుగులో సాహిత్య విమర్శ వికాసాన్ని వివరించండి.
2. తెలుగులో తులనాత్మక సాహిత్య అధ్యయనాంశాలను పేర్కొనండి.
3. మను, వసు చరిత్రలపై జరిగిన పరిశోధనలను సమీక్షించండి.
4. విమర్శన వ్యాస స్వరూప, స్వభావాలను తెలపండి.
5. సమీక్ష, విమర్శ, పరిశోధనల మధ్య గల భేద సాదృశ్యాలు.
- ) 0 (-


జి.వి.రత్నాకర్ ‘అట్లేటి అల’ - పరిశీలన

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November: 201
5
Time: 3 Hours
           Max.marks: 60
------------------------------------------------------------------------------------------------------------------------
   Student:        Mr. G.Srinu, Roll No: 15HTHL11
                 -------------------------------------------------------------------------------------------------------------
                                                                                   

పరిశోధనాంశం:
జి.వి.రత్నాకర్ ‘అట్లేటి అల’ - పరిశీలన


                                    కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
 వీటిలో నాల్గవ ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి.
 ( 3 x 20 = 60)
1. జి.వి.రత్నాకర్ జీవితం, రచనలను పరిచయం చేయండి.
2.జి.వి.రత్నాకర్ సాహిత్య దృక్పథాన్ని పేర్కొనండి.
3. ‘అట్లేటి అల’ దీర్ఘకావ్యంలో గల వస్తు వైవిధ్యాన్ని సోదాహరణంగా తెలపండి.
4. ­మీ పరిశోధనాంశాన్ని పరిచయం చేసి అధ్యయన ప్రణాళికను వివరించండి.
5.  ‘అట్లేటి అల’ దీర్ఘకావ్యంలో గల ప్రతీకలను విశ్లేషించండి.
             

- ) 0 (-

మను,వసు చరిత్రల విమర్శ వ్యాసాలు – పరిశీలన

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November: 201
5
Time: 3 Hours             Max.marks: 60
----------------------------------------------------------------------------------------------------------------------------
Student Name & Roll NO: I.Sumalatha  15HT HL02
-------------------------------------------------------------------------------------------------------------------------------

పరిశోధన అంశం :
మను,వసు చరిత్రల విమర్శ వ్యాసాలు పరిశీలన
(అముద్రిత గ్రంథ చింతామణి, భారతి పత్రికల వ్యాసాల ప్రత్యేక పరిశీలన)

కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
 వీటిలో నాల్గవ ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి.
 ( 3 x 20 = 60)
1.    మను, వసు చరిత్రలను, వాటి కర్తృత్వాది అంశాలను స్థూలంగా పరిచయం చేయండి.
2.    మను, వసు చరిత్రలపై జరిగిన తులనాత్మక పరిశోధనలను సమీక్షించండి.
3.     మను, వసు చరిత్రలలోని తాత్త్విక దృక్పథాన్ని చర్చించండి.
4.    ­మీ పరిశోధనాంశాన్ని పరిచయం చేసి అధ్యయన ప్రణాళికను వివరించండి.
5.    మను, వసు చరిత్రలపై వచ్చిన విమర్శల స్వభావాన్ని పేర్కొనండి.
           
- ) 0 (-


Modern Literature (Fiction)

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
End Semester Examinations-November: 2015
M.A.,
III Semester,
HT 523  Modern Literature (Fiction)

Time: 3 Hours                                                                               Max.marks: 60

సూచన: కింది వానిలో ఏవైనా మూడు ప్రశ్నలకు సమగ్రమైన సమాధానాలను రాయండి.  ( 3x15 = 45 మార్కులు)
1.    కల్పనా సాహిత్యం అంటే ఏమిటో వివరించి, దాని ఆవిర్భావ నేపథ్యాలను తెలియజేయండి.
2.    తెలుగు కథ, నవలను నిర్వచించి వాటి మౌలిక లక్షణాలను సోదాహరణంగా సమన్వయించండి.
3.    తొలి తెలుగు నవల వివాదాల్ని చర్చించి, రాజశేఖర చరిత్ర నవల విశిష్టతను తెల్పండి.
4.    చివరకు మిగిలేది నవల ఆధారంగా మనస్తత్త్వ విశ్లేషణ పద్ధతిని వివరించండి.
5.    తెలుగు కథా సాహిత్యంలో కనిపించే వివిధ ధోరణులను పరిచయం చేయండి.
6.    ఓపువ్వుపూసింది, ఇల్లలకగానే... కథల్లో కనిపించే స్త్రీవాద దృక్పథాలను విశ్లేషించండి.
సూచన: కింది వానిలో ఏవైనా మూడు ప్రశ్నలకు సంక్షిప్త సమాధానాలు రాయండి.            (3 x 5 = 15 మార్కులు)
7.    గురజాడ అప్పారావు
8.    అల్లంరాజయ్య – మనిషిలోపలి విధ్వంసం
9.    సర్వసాక్షి దృష్టికోణం
10.  Round Characters, Flat Characters
11.  అజ్ఞాతవాసం – దళితుల హక్కులు
12.  కలుపుమొక్కలు-రచనాశిల్పం
13.  మాయ-వస్తు విశ్లేషణ
14.  మాలపల్లి నవల-జాతీయోద్యమం
-0-